ధోని గత రెండు సంవత్సరాల నుంచి IPL నుంచి తప్పుకుంటున్నాడు అనే విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై CSK టీమ్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. మా టీం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనినే. అని తెలియజేశారు. అంతే కాకుండా తను ఇంకా రెండు సంవత్సరాల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా CSK టీం ఎగ్జిక్యూటివ్ "కాశీ విశ్వనాధ్" IANS తో వెల్లడించారు.