శుక్రవారం టోక్యో ఒలంపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాణా సంచా పేల్చి ఒలపింక్ క్రీడలను ప్రారంభించారు. అయితే టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న గ్రామంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రస్తుతం కరోనా తగ్గుముకం పట్టినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దాంతో కరోనా నిబంధనల మధ్య ఈ ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఒలపింక్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా టోక్యో నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ ఒలంపిక్ జట్టు కు చెందిన జెండా మోసేవారు తమ హక్కులను పెట్టుకోకుండా కరోనా నిబంధనలకు విరుద్ధంగా వచ్చారు. అయితే ఆటగాళ్లు మాత్రం ముఖాలకు మాస్క్లు కప్పి ఉంచుకున్నారు.