ఇక భారత్ ఇచ్చిన 82 పరుగుల టార్గెట్ ను శ్రీలంక కేవలం మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. మరో 33 బంతులు మిగిలుండగానే శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా 8 టీ-20 సిరీస్ విజయాల తర్వాత భారత్ ఓటమి పాలైతే.. వరుసగా 5 టీ-20 సిరీస్ ఓటముల తర్వాత శ్రీలంక విజయం సాధించింది.