ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకి సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ. ఆయన గత ఇంటర్వ్యూలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. జులపాల జుట్టు పెంచుకోడానికి ఏ హీరో మీకు ఆదర్శం అని అడిగితే, తనకు తానే హీరో అని చెప్పి గతంలో అందరికీ షాకిచ్చారు నీరజ్. అలాంటి నీరజ్ ఇప్పుడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీపై అదిరిపోయే పంచ్ వేశారు.