టీ 20 ప్రపంచకప్ కొద్దిరోజుల్లోనే జరుగన్న విషయం తెలిసిందే. అయితే అందరి ఎదురు చూపు భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ వైపు ఉంది. ప్రపంచం మొత్తం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారు. పనులను సైతం వదులుకొని వీక్షిస్తుంటారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించనున్నట్టు ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన కొద్ది సమయంలోనే భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు హాట్ కేకులా అమ్ముడు పోయాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. మాటలతో దాడి చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు.