టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను రవి బిష్ణోయ్ అద్భుతంగా క్యాచ్ చేసి పెవిలియన్ చేర్చగా, సూర్యకుమార్ సంబరాలు చేసుకోవడానికి వెళ్లారు. ఈ సందర్భంలో బిష్ణోయ్ టోపీ నేలపై పడింది. దీన్ని గమనించిన సూర్యకుమార్ వెంటనే ఆ టోపీని తీసి, రింకు సింగ్‌కు ఇచ్చి, తర్వాత బిష్ణోయ్‌ను హగ్ చేసుకున్నారు. ఈ చర్య ద్వారా జాతీయ జెండాపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు.