ప్రస్తుతం ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో ఉంది. నిన్న ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 290 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తద్వారా ఇంగ్లాండ్ 99 పరుగుల ఆధిక్యంతో ముందంజలో ఉంది. 99 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియన్ ఓపెనర్లు రోహిత్ మరియు రాహుల్ ఇద్దరూ మనము నిన్న అనుకున్న విధంగానే ఆచి తూచి ఆడుతూ 50 పరుగుల భాగస్వామ్యానికి ఏడు పరుగుల దూరంలో నిలిచారు. అయినప్పటికీ టీం ఇండియా ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉంది. అయితే ఇంగ్లాండ్ శిభిరంలో అప్పుడే గెలుపు ఆశలు చిగిరించినట్లు ఉన్నాయి. అందరూ చాలా సంతోషంగా నిన్న మైదానాన్ని వీడారు. నిన్న ఇంగ్లాండ్ బౌలర్లు 16 ఓవర్లు పాటు బౌలింగ్ చేసినా మొదటి వికెట్ ను పొందలేకపోవడం భారత్ కు శుభసూచకమే.
ఈ అవకాశాన్ని మరియు భాగస్వామ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు ఇంకాసేపట్లో మూడవ రోజు ఆట ప్రారంభం కానుండగా టీమిండియా ఆటగాళ్లు గుర్తించుకోవాల్సిన విషయాలు. ఇన్నింగ్స్ మొదలైన మరో రెండు గంటల పాటు తొందరపడకుండా ఎక్కువగా సింగిల్స్ రొటేట్ చేస్తూ ఉండాలి. ఒక్క సెషన్ వికెట్ కాపాడుకుంటే ఆ తర్వాత లీడ్ పెంచుకునేందుకు ఆడవచ్చు. అయితే మొదటి సెషన్ లో వికెట్స్ కోల్పోతే ఓటమి తప్పదు. ముఖ్యంగా క్రిస్ వోక్స్ బౌలింగ్ ను చూసి ఆడాలి. ఈ టెస్ట్ లో ఓటమి నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఈరోజు రేపు వరకు ఆడాల్సి ఉంటుంది. అప్పుడే కనీసం 300 పైచిలుకు పరుగుల లీడ్ తెచ్చుకుని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ ఇన్నింగ్స్ లో ఇద్దరు ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం ఆడగలిగితే ఓటమి నుండి తప్పించుకోవచ్చు.
లాస్ట్ టెస్ట్ నుండి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ తన డైన శైలిలో చెలరేగి ఆడాలి. లోయర్ ఆర్డర్ లో ఎలాగూ శార్దూల్ ఠాకూర్ మంచి టచ్ లో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్ లోనూ అతని బ్యాట్ నుండి విలువైన పరుగులు అవసరమవుతాయి. ఇక ఈ మ్యాచ్ భారం మొత్తం కోహ్లీ రిషబ్ పంత్ ల మీదనే ఉంది. పంత్ పూర్తిగా ఆత్మరక్షణలో పడకుండా జాగ్రత్తగా బ్యాడ్ బాల్స్ ను మాత్రమే బౌండరీకి తరలించాలి మిగతా బాల్స్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ వెళితే, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కనీసం క్రీజులో ఒక అర్ధ గంట అయినా నిలబడితే పరుగులు వస్తాయి. మరి రిషబ్ ఏ విధంగా ఆడుతాడన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: