ఐపీఎల్ తో కోట్లు సంపాదించి.. ఇప్పుడు ఇలా అంటాడా?
అయితే ఇక ఈ సారి మాత్రం ఐపీఎల్లో ఆడటానికి ఎంతో మంది క్రికెటర్లు వెనకడుగు వేస్తున్నారు. దీనికి కారణం కరోనా వైరస్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రస్తుతం వరుసగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఇలా ఐపీఎల్ నుంచి తప్పుకున్న క్రికెటర్లలో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కూడా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన బెన్ స్టోక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించడం మాత్రం అందరికీ షాక్ కి గురి చేస్తుంది. అయితే ఐపీఎల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బెన్ స్టోక్స్ కోట్ల రూపాయలను సంపాదించాడు అని చెప్పాలి.
ఐపీఎల్ ద్వారా ఎన్నో కోట్ల ఆదాయాన్ని సంపాదించినా బెన్ స్టోక్స్ ఇక ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి తక్కువ చేసి మాట్లాడటం అభిమానులందరికీ కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఐపీఎల్ కంటే టెస్ట్ క్రికెట్ కే తన నెంబర్‌వన్ ప్రాధాన్యత అంటూ మనసులో మాట బయట పెట్టాడు. టెస్ట్ కెప్టెన్ గా ఉన్న జోరూట్ తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. మా టెస్ట్ జట్టు చాలా బ్యాడ్ గా ఉందని అందుకే ఐపీఎల్‌కు కనీసం పేరు కూడా రిజిస్టర్ చేసుకోలేదు అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో సుదీర్ఘంగా ఆడాలని అన్నదే నా కోరిక అంటూ తెలిపాడూ. అందుకే ఐ పీ ఎల్ కు దూరంగా ఉన్నానని.. ఒకవేళ ఐపీఎల్ లో ఆడిన కూడా మనస్ఫూర్తిగా ఆడక పోయేవాడిని అంటూ బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఐపీఎల్ అభిమానులందరినీ కూడా షాక్ కి గురి చేస్తున్నాయ్.