బీసీసీఐ నిర్ణయం.. కోహ్లీ ఫాన్స్ కు మండిపోతుంది?

praveen
టీమిండియా లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇటీవలే అనూహ్య పరిణామాల నేపథ్యంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు ఇక ఇలా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న నాటినుంచి బిసిసిఐకి కోహ్లీ కి మధ్య చిన్నపాటి వివాదం కొనసాగుతోంది అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం జట్టులో ఒక సాదాసీదా ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు.  కానీ అటు బిసిసిఐ తీసుకున్న నిర్ణయాలు మాత్రం కోహ్లీ అభిమానులందరికీ షాక్ ఇస్తూనే  ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడే తన వందో టెస్టు ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా వెన్నునొప్పి గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఒక టెస్టుకు దూరం అయ్యాడు విరాట్ కోహ్లీ..

 దీంతో కెప్టెన్ గా కాకుండా ఒక సాదా సీదా ఆటగాడిగా ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక దీని కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తో అటు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు టెస్టుల సిరీస్ శ్రీలంకతో జరిగబోతుంది. మార్చి 4 నుంచి ఇక మొహాలీ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఇదే కోహ్లీ కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.. అయితే ఇక స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో ఒక మైలురాయి లాంటి మ్యాచ్ లో ప్రేక్షకులను  పూర్తిస్థాయిలో అనుమతించడం లేదు అంటూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ప్రస్తుతం షాకింగ్ గా మారిపోయింది.

 కోహ్లీ విషయంలో కక్షపూరితంగా బీసీసీఐ వ్యవహరించిందని అందుకే ఇలా ప్రేక్షకులను అనుమతించకుండా నిర్ణయం తీసుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దీనిపై పంజాబ్ క్రికెట్ సంఘం మాత్రం మరోలా స్పందించింది. కరోనా కేసులు వస్తుండడంతో బిసిసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రేక్షకులు లేకుండానే భారత్ శ్రీలంక మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరిపేందుకు నిర్ణయించింది. మొహాలీ స్టేడియం లో అంతర్జాతీయ మ్యాచ్లు జరిగి దాదాపు మూడేళ్లు అవుతుందని అందుకే ఎలాంటి అడ్డంకులు లేకుండా బిసిసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పుకొచ్చింది పంజాబ్ క్రికెట్ సంఘం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: