మరీ ఇంత మార్పా.. అతను నా బ్రదర్ అంటున్న దీపక్ హుడా?

praveen
క్రికెట్ ప్రేక్షకుల అందరికీ గుర్తుండే ఉంటుంది.. కృనాల్ పాండ్య  దీపక్ హుడా  మధ్య జరిగినగొడవ భారత క్రికెట్ లో ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృనాల్ పాండ్య నన్ను అసభ్య పదజాలంతో దూషించాడు అంటూ దీపక్ హుడా ఆరోపించాడు. అంతేకాదు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది అప్పట్లో సంచలనం గానే మారిపోయింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా బరోడా కెప్టెన్ గా ఉన్నాడు కృనాల్. అదే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దీపక్ హుడా.  అసభ్యంగా దూషిస్తూ స్థానంలో జట్టులో ఆడనివ్వను అని బెదిరింపులకు పాల్పడ్డాడు అంటు ఆరోపించాడు దీపక్ హుడా.  బరోడా టీమ్ నుంచి బయటకు వెళ్లి రాజస్థాన్ ఆ జట్టు తరఫున ఆడాడు. అయితే ఇక ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో ఇద్దరినీ కూడా లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

 ఇలా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గొడవ పడ్డ ఇద్దరు ప్లేయర్లు కూడా ఇప్పుడు కలిసి ఆడుతున్నారు. దీంతో ఇద్దరు వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో మొన్నటికి మొన్న దీపక్ హుడా కృనాల్ పాండ్య మ్యాచ్ గెలిచిన సందర్భంలో ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవలె దీపక్ హుడా కృనాల్ పాండ్య  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కృనాల్ పాండ్యా తనకు సోదరుడు లాంటివాడు అంటూ దీపక్ హుడా చెబుతూ ఉన్నాడు.

 సోదరులు అన్న తర్వాత అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లక్నో జట్టును విజేతగా నిలపడం లక్ష్యంగా ఇద్దరం ఆడుతున్నాం. మెగా వేలం సమయంలో నేను అందుబాటులో లేను అందరిలాగానే హోటల్లో కలుసుకున్నాం. గతంలో జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఒకే జట్టు తరఫున ఆడుతున్న మా ఇద్దరి లక్ష్యం ఒకటే అంటూ దీపక్ హుడా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: