దినేష్ కార్తీక్.. టి20 ప్రపంచకప్ లో చోటు పక్కా : రవి శాస్త్రి
టీమిండియాలో ఫినిషర్ బెడద వేధిస్తున్న నేపథ్యంలో ఆ అదిరిపోయే ఫినిషర్ నేనే అంటూ చెప్పకనే చెబుతున్నాడు దినేష్ కార్తీక్. ఇక ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ తిరుగులేదు అని నిరూపిస్తున్నాడూ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల దినేష్ కార్తీక్ పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. దినేష్ కార్తీక్ ఇదే ఫామ్ లో సీజన్ మొత్తం కొనసాగితే ఇక రానున్న టీ20 ప్రపంచ కప్ లో అతనికి చోటు దక్కడం ఎంతో సులభం గా మారిపోతుంది అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. యువ వికెట్ కీపర్ ల నుంచి మాత్రం అతనికి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని చెప్పుకొచ్చాడు.
టీమిండియా సినియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అత్యుత్తమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో గొప్పగా రాణిస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే ఎదురుదాడికి దిగుతున్నాడూ. అతడికి క్రికెట్ లో ఉన్న అనుభవాన్ని మొత్తం కూడగట్టుకుని ఎంతో అలవోకగా మంచి షాట్లు ఆడ గలుగుతున్నాడు. మేటి ఫినిషర్ గా పేరున్న ధోని కూడా ప్రస్తుతం టీమిండియాలో లేడు. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఫినిషెర్ స్థానం టీమిండియాలో ఖాళీగానే ఉంది. అందుకే దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోవాలని అదే సమయంలో జట్టు లో ఎంత మంది కీపర్లు ఉన్నారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ లాంటి యువ కూడా అందుబాటులో ఉన్నారు ఇక దినేష్ కార్తీక్ లాంటి యువ ఆటగాళ్లకు కూడా పోటీ చేస్తున్నాడు అంటు రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు కాగా ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు దినేష్ కార్తీక్..