బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి?
మసాలా ఫుడ్డు లేకుండా ఒక్క ముద్ద కూడా దిగడం లేదు అని చెప్పాలి నేటి రోజుల్లో. ఇక ఇదంతా పక్కన పెడితే నేటి రోజుల్లో ఏ ఉద్యోగం చేసినా ఒకేచోట గంటల తరబడి కూర్చుని చేసేదే. కనీసం పక్కకు లేచి కాసేపు నడవడానికి కూడా సమయం లేని పరిస్థితి. ఇక అలాంటి ఉద్యోగంలో కొనసాగుతూనే కొత్త ఆహారపు అలవాట్లు చేసుకుని ఇక వ్యాయామానికి దూరంగా ఉంటే జరిగేది ఏంటి స్థూలకాయం. ఒక్కసారిగా బరువు పెరిగి పోయి ఇటీవల కాలంలో ఎంతోమంది ఇబ్బందిపడుతున్నారు. ఇక బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
అయితే ప్రతిరోజూ వ్యాయామం చేయడం కాకుండా ఇక వ్యాయామంతో పాటు కొన్ని టిప్స్ పాటిస్తే ఇక బరువు తొందరగా తగ్గేందుకు అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక పరగడుపున పది నుంచి పన్నెండు కరివేపాకు ఆకులను తినాలి. అంతేకాదండోయ్ ఇక భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో 10 గ్రాములు తేనెతో వేడినీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. పండ్లు కూరగాయలు పుష్కలంగా తినండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం బెటర్. ఇలా చేయడం వల్ల బరువు తొందరగా తగ్గే అవకాశం ఉందట..