ఐపీఎల్ : ప్లే ఆఫ్ లో సెంచరీ చేసిన ఆటగాళ్ళు వీళ్ళే?
ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న సమయంలో అప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టని యువ ఆటగాడు రజాత్ మాత్రం ఏకంగా సెంచరీతో విజృంభించాడు. బౌలర్లు అందరిపై కూడా వీరవిహారం చేశాడు అని చెప్పాలి. మొత్తం 54 బంతుల్లో 112 పరుగులు చేశాడు ఈ యువ ఆటగాడు సాధారణంగా లీగ్ మ్యాచ్లలో ఇలాంటి ప్రదర్శనలు చేయడం కామన్.. ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఇలాంటి ప్రదర్శనలు చేసినా ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.
ప్లే అఫ్ మ్యాచ్లో సెంచరీ చేసిన మొదటి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు రజాత్. ఈ క్రమంలోనే ప్లేఆఫ్ లో సెంచరీ చేసిన ఆటగాళ్ళు వివరాలు ఏంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే.. మురళీ విజయ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ 2012లో జరిగిన ప్లే ఆఫ్ 58 బంతుల్లో 113 పరుగులు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్ 2014లో చెన్నైపై పంజాబ్ తరఫున 55 బంతుల్లో 122 పరుగులు చేశాడు వృద్ధిమాన్ సాహా పంజాబ్ తరఫున 56 బంతుల్లో 115 పరుగులు 2014 సీజన్లో చేశాడు. షేన్ వాట్సన్ 2018లో సన్రైజర్స్ పై చెన్నై తరుపున 55 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు రజత్ 54 గంటలు 112 పరుగులు చేశాడు..