ఇక మొదటి ఇన్నింగ్స్ లో అయితే 11 పరుగులకే అవుట్ అయిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ నుండి ఈ రోజుకి కోహ్లీ ఏ ఫార్మాట్ లో అయినా సెంచరీ చేసింది లేదు. ఫామ్ లో లేకపోవడం వలనే తాను అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా రాజీనామా చేశాడు. అయితే తన అభిమానుల నుండి మాత్రం తనకు మద్దతు ఇంకా ఉండడం గమనార్హం. తాను ఫామ్ లో ఉన్నా లేకపోయినా, అభిమానులు అదే ఉత్సాహంతో తనను సపోర్ట్ చేస్తున్నారు.
అయితే ఎందుకు ఇలా కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడు అన్నది టీం ఇండియా యాజమాన్యాన్ని ఎంతగానో కలవరపరుస్తోంది. ఇక ఇండియా మాజీ ప్లేయర్స్ అయితే కోహ్లీ కనీసం దేశవాళీ టోర్నీలలో ఆడి ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ అయిన తరువాత ఏదైనా దేశంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి తానేంటో ప్రూవ్ చేసుకోవాలి. మరి కోహ్లీ ఈ తన ఫామ్ పట్ల వస్తున్న ఈ విమర్శల నుండి ఎలా బయట పడతాడు అన్నది తెలియాల్సి ఉంది.