ఆసియా కప్ నుండి.. ఆవేష్ ఖాన్ ఔట్?

praveen
ఆసియా కప్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించిన టీమిండియాకు ఇప్పుడు మాత్రం వరుసగా ఊహించని షాక్ లు ఎదురవుతున్నాయి అన్నది తెలుస్తుంది. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి దూరం అవుతూ ఉన్న  నేపథ్యంలో మొన్నటి వరకు పటిష్టంగా కనిపించిన టీమిండియా లైనప్ లో కాస్త బలహీన పడుతూ వస్తుంది అని చెప్పాలి. ఇటీవలె స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా టీమిండియాలో అద్భుత ప్రదర్శన చేసిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను గాయం కారణంగా దూరమయ్యాడు. ఆసియా కప్ టోర్నీకి మొత్తం దూరం కావడమే కాదు అక్టోబరులో జరగబోయే వరల్డ్ కప్ కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.

 అదే సమయంలో ఇటీవల ఆసియా కప్లో భాగంగా బౌలర్గా జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాడు ఆవేష్ ఖాన్ కూడా జట్టుకు దూరమయ్యాడు అన్నది తెలుస్తుంది. భారత్ తరపున రెండు మ్యాచ్లు ఆడిన ఆవేశ్ ఖాన్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. సూపర్ 4 లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం జ్వరం కారణంగా టీమిండియాకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని టీమిండియా అధికారులు చెబుతున్నారు. తద్వారా బౌలర్లు ఆవేశ్ ఖాన్ మిగిలిన అన్ని ఆసియా కప్ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు.

 ఈ క్రమంలోనే ఆసియా కప్లో భాగంగా ఆవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్ జట్టులోకి రాబోతున్నాడు అని తెలుస్తోంది. ఇకపోతే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు ఇటీవలే సర్జరీ ఎంతో విజయవంతంగా పూర్తయింది అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా టీమ్ ఇండియా లో ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డ దూరం అవుతూ ఉండటం మాత్రం ఎదురు దెబ్బ అని చెప్పాలి. అయితే ఇటీవలే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయిన ఫైనల్ అవకాశాలను దాదాపు గల్లంతు అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: