ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ ఎంపిక... టెన్షన్ లో వార్నర్ భాయ్ ?

VAMSI
ఎన్నో సార్లు క్రికెట్ లో విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టీం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన అద్భుతమైన ఆట వీరి సొంతం. అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా చూస్తే ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. చిన్న చిన్న టీం లతో కూడా కష్టపడి గెలుస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న అయితే జింబాబ్వే లాంటి పసికూన చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఆస్ట్రేలియా వన్ డే మరియు టీ 20 జట్లకు ఆరోన్ ఫించ్ కెప్టెన్ గా ఉండగా, న్యూజిలాండ్ తో వన్ డే సిరీస్ గెలిచిన అనంతరం వన్ డే లకు గుడ్ బై చెప్పాడు. కానీ టీ 20 లకు మాత్రం కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఈ కారణంగా వన్ డే కెప్టెన్సీ స్థానం ఖాళీగా ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ కు ముందున్న అతి పెద్ద సవాల్.. వన్ డే కెప్టెన్ ను ఎంచుకోవడమే. దీని కోసం ప్రస్తుతం రేసులో ఉన్నది ఎవరనేది ఇంకా స్పష్టత లేకపోయినా ఒక విషయం మాత్రం తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ పేరును సి ఏ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ గతంలో బాల్ టాంపరింగ్ వివాదంలో ఉన్న ముగ్గురిలో వార్నర్ కూడా ఒకరు. ఈ ప్రభావంగా కెప్టెన్సీ గ్రూప్ లో నుండి వార్నర్ తొలగించబడ్డాడు. మరో ఇద్దరు స్టీవ్ స్మిత్ మరియు కామెరాన్ బాన్ క్రాఫ్ట్... ఇక స్మిత్ రెండేళ్లపాటు కెప్టెన్సీ చేయకూడదన్నషరతుతో మరియు వార్నర్ ఏకంగా క్రికెట్ కె కొంతకాలం దూరంగా ఉన్నాడు.
అయితే వార్నర్ జట్టులోకి తిరిగి వచ్చాక చాలా పరిపక్వతతో ఉన్నాడు. జట్టుకు కూడా మంచి విజయాలను అందించాడు. అందుకే ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ గా ఉన్న పాట్ కమిన్స్ కూడా తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు సిపారసు చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ లో ఉన్న మరికొందరు కూడా వార్నర్ ను కెప్టెన్ చేయాలని ఆశిస్తున్నారు. కానీ వార్నర్ కు మాత్రం ఏ కోశానా కెప్టెన్ అవుతాను అన్న నమ్మకం లేదు. దీనితో తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: