ఇండియాతో మ్యాచ్ కు ముందు.. ఇంగ్లాండ్ కు ఊహించని షాక్?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా మొన్నటి వరకు జరిగిన సూపర్ 12 మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎట్టకేలకు ఇక సెమీఫైనల్ లో అవకాశం దక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టు నవంబర్ పదవ తేదీన భారత్ జట్టుతో సెమి ఫైనల్ కు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సెమీఫైనల్ పోరు జరగడానికి ఒకరోజు ముందే పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మరో సెమి ఫైనల్ పోరు జరగబోతుంది. ఇక వరుసగా రెండు రోజులు అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇకపోతే సెమీఫైనల్ అర్హత సాధించిన నాలుగు జట్లు కూడా కీలకమైన పోరు కోసం తమ జట్టును సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇక సెమి ఫైనల్లో విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టాలని భావిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే నవంబర్ 10వ తేదీన టీమ్ ఇండియాతో ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఇక సెమి ఫైనల్ పోరుకు ముందే ఇంగ్లాండు జట్టుకు ఊహించిన షాక్ తగిలింది అని చెప్పాలి.  జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విధ్వంసకర బ్యాట్స్మెన్ డేవిడ్ మల్లాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

 గజ్జల్లో గాయం కావడంతో ఇక టీమ్ ఇండియాతో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు అతను అందుబాటులో ఉండడం లేదు అన్నది తెలుస్తుంది. ఇటీవల నవంబర్ ఒకటవ తేదీన శ్రీలంకతో జరిగిన డిసైడర్ మ్యాచ్లో గాయపడిన డేవిడ్ మలాన్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు అతను గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టీమ్ ఇండియా తో మ్యాచ్ కి కూడా అందుబాటులో ఉండలేడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు.  మలాన్ స్థలాన్ని ఫీల్ స్టాల్ట్ తో రీప్లేస్ చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే విధ్వంసకర  బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ మల్లాన్ ఈ ఏడాది మాత్రం ప్రపంచకప్ లో పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఈ ఏడాది వరల్డ్ కప్ లో అతని అత్యధిక స్కోరు 35 మాత్రమే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: