అర్జున్ ను పక్కన పెట్టడమెందుకు.. అలా వాడుకుంటే సరిపోద్ది?
అయితే పవర్ ప్లే లో బాగా బంతులు వేస్తున్నాడని నమ్మిన రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో డెత్ ఓవర్లలో కూడా అర్జున్ చేతికి బంతిని అందించాడు. కానీ అతని బౌలింగ్లో శ్యాం కురాన్, హర్ ప్రీత్ సింగ్ భాటియా సిక్సర్ల మోత మోగించాడు. దీంతో ఓకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్నాడు అర్జున్. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి రెండు ఓవర్లలో 9 పరుగులు ఇచ్చిన అతనికి మళ్ళీ బౌలింగ్ ఇచ్చే సాహసం చేయలేదు రోహిత్ శర్మ. అయితే ఇలా రెండు ఓవర్లు మాత్రమే వేసి అతన్ని పక్కన పెడితే మరో రెండు ఓవర్ల కోట కోసం మరో బౌలర్ ని ఆడించాల్సి ఉంటుంది. తద్వారా ఇక మరో బౌలర్ కోసం చూసి ఒక అదనపు బ్యాట్స్మెన్ ను కోల్పోతుంది ముంబై ఇండియన్స్.
ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ దుల్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా ఉద్దేశంలో అయితే అర్జున్ టెండూల్కర్ డెత్ ఓవర్ బౌలర్ కాదు. అతని చివరి ఓవర్ లో ప్రెజర్ ని తట్టుకుంటూ బౌలింగ్ చేయలేడు. పంజాబ్ కింగ్స్ తో అలాంటి ప్రయత్నం చేసిన రోహిత్ కు షాక్ తగిలింది. అందుకే అర్జున్ ను డెత్ ఓవర్లలో కాకుండా పవర్ ప్లే లో వాడుకుంటే బాగుంటుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహార్ బౌలింగ్ గమనిస్తే ఇద్దరు పవర్ ప్లే లో బౌలింగ్ అద్భుతంగా చేస్తారు. దీపక్ అయితే పవర్ ప్లే లో తన స్పెల్ ముగిస్తాడు. మళ్లీ బౌలింగ్కు రాడు. అర్జున్ టెండూల్కర్ కి కూడా చివర్లో కాకుండా పవర్ ప్లే లోనే బౌలింగ్ ఇస్తే బాగుంటుంది. అతన్ని ఇలా డెత్ ఓవర్ లో కాకుండా పవర్ ప్లే లో వాడుకుంటే బాగుంటుందని మాజీ క్రికెటర్ సైమన్ దుల్ వ్యాఖ్యానించాడు.