జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాకు.. బిగ్ షాక్?
ఇక ఇప్పుడు రెండో మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా ఆట తీరు చూస్తే మరోసారి ఘనవిజయాన్ని అందుకునేలాగే కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా ఇంగ్లాండ్ తో యాషెష్ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అటు ఆస్ట్రేలియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జట్టులో కీలకమైన బౌలర్గా కొనసాగుతున్న స్పిన్నర్ నాథన్ లియోన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు దీంతో ఇటీవలే బౌలింగ్ కూడా చేయలేకపోయాడు . అయితే ఇటీవల వైద్యులు అతని గాయానికి స్కానింగ్ తీయగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని తేల్చారు. దీంతో అతను ఇక సిరీస్ మొత్తానికి దూరం కాబోతున్నాడట.
మిగిలిన మ్యాచ్ కి నాథన్ లియోన్ అందుబాటులో ఉండడం లేదు అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జోరు మీద ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు ఇది ఊహించని ఎదురు దెబ్బ అని చెప్పాలి. అయితే మిగిలిన టెస్ట్ మ్యాచ్ లకు నాథన్ లియోన్ స్థానంలో మర్ఫీని జట్టులోకి తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది. కాగా ఇటీవలే నాథన్ లియోన్ వరుసగా 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన తొలి బౌలర్గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో జట్టులోకి వచ్చే మర్పి తన స్పిన్ బౌలింగ్ తో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఏది ఏమైనా లియోన్ లాంటి బౌలర్ దూరం కావడం మాత్రం ఆస్ట్రేలియా వ్యూహాలను తారుమారు చేసే అవకాశం ఉంది.