సీనియర్ ప్లేయర్లు సైతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న మైదానంలో.. యంగ్ ప్లేయర్ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే ఎంతో అలబోకగా సెంచరీలు చేసి ఇక రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే రాజస్థాన్ అటు టోర్నీలో చెప్పుకోదగ్గ ప్రస్థానాన్ని కొనసాగించకపోయినప్పటికీ.. యశస్వి జైస్వాల్ ప్రదర్శన గురించి మాత్రం అందరూ గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సెలెక్టర్ల చూపును ఆకర్షించిన ఈ క్రికెటర్.. ఇటీవల వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఎంపిక అయ్యాడు. అయితే మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.
అయితే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జైష్వాల్ తొలిసారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రవేశించాడు. ఏకంగా 73వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైష్వాల్ ఇద్దరు కూడా సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో చాలా రోజుల తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ టాప్ 10 లోకి రాగా.. అటు యశస్వి జైస్వాల్ మొదటిసారి ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించుకుని 73వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో రిషబ్ పంత్ 11, విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నారు అని చెప్పాలీ.