5 వికెట్లు తీసి.. సూపర్ రికార్డు సాధించిన జడేజా?
ప్రత్యర్థి జట్టు ఎంత పటిష్టంగా ఉన్న అప్పటివరకు ఎన్ని రికార్డులు సాధించిన సరే తాము ఒక్కసారి బరిలోకి దిగాము అంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది అన్న విధంగా భారత జట్టు ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని చాలా ఇస్తూ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లకు గాను అన్నింటిలో కూడా విజయం సాధించింది. ఇక పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి సెమీఫైనల్ లో కూడా అడుగు పెట్టింది టీమిండియా. ఇక ఇటీవల సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 243 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.
అయితే అంతకుముందు మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీసి ప్రత్యర్థులను దెబ్బ కొడితే సౌత్ఆఫ్రికా తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఇరగదీసాడు. ముందు బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా 5 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్ లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన రెండవ భారత ఆఫ్ స్పిన్నర్‌గా నిలిచాడు. 2011లో టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఐర్లాండ్ పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్ లో యువరాజ్ 10 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక గత వరల్డ్ కప్ లో చాహల్ నాలుగు వికెట్లు తీసిన రికార్డును సొంతం చేసుకున్నాడు.