ఈరోజుల్లో కూడా ఇలాంటి మనుషులున్నారా.. నిజంగా గ్రేట్?
ఇలా భూముల కొట్లాటలో ప్రాణాలు కోల్పోతున్న అన్నదమ్ములు ఎంతోమంది ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా నేటి రోజుల్లో మనీకి ఆస్తులకి ఉన్న విలువ మనుషులకు లేదు. ఇక ఎవరిలో మానవత్వం కూడా కనిపించడం లేదు ఇలాంటి నేటి స్వార్థపూరిత సమాజంలో కూడా ఇంకా అక్కడక్కడ మనసున్న గొప్పోళ్ళు ఉన్నారు అన్నదానికి సంబంధించి కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక గొప్ప మనిషి గురించే. ఏకంగా ప్రభుత్వ పాఠశాల కోసం కోట్ల రూపాయల విలువైన భూమిని దానంగా ఇచ్చింది ఒక మహిళ.
ఏడు కోట్ల రూపాయల విలువైన ఎకరం భూమిని ప్రభుత్వానికి రాసి ఇచ్చింది. తమిళనాడులోని మధురై కి చెందిన ఓ మహిళ తాను చేసిన దాతృత్వంతో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలను విస్తరించేందుకు భూమి కావాల్సి వచ్చింది. అయితే తన భూమిని ఇచ్చేందుకు ఆయపురాన్ అమ్మాల్ అనే మహిళా సిద్ధమైంది. అయితే ఆమె చేసిన గొప్ప పనికి ప్రభుత్వం స్పందించింది. జనవరి 26వ తేదీన ఆమెను ఘనంగా సత్కరించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆమె ఒక బ్యాంకులో క్లర్క్ గా పని చేస్తుంది. కడిక్కులం లోనే ఉట్టకడై సమీపంలో ఆమెకు ఎకర భూమి ఉంది. దాని విలువ ఏడు కోట్లు. అయితే ప్రభుత్వ పాఠశాల కోసం ఇంత విలువైన భూమిని ఇచ్చేసింది ఆమె. ఇక ఈ విషయం తెలిసి ఈరోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అని ఎంతో మంది నేటిజన్స్ షాక్ అవుతున్నారు.