హార్దిక్ అంత స్పెషలేంటి.. సెలెక్టర్లపై భారత మాజీ ఆగ్రహం?

praveen
జూన్ నెలలో వెస్టిండీస్, యూఎస్ వేదికగా ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టు వివరాలను ఇటీవల సెలక్టర్లు ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించడంతో పాటు ఇక మరోవైపు రిజర్వ్ లిస్టులో ఎవరు అన్నారు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ఇలా వరల్డ్ కప్ జట్టు ప్రకటన జరిగిందో లేదో ఒక విషయంపై మాత్రం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఐపీఎల్లో ఫుల్ ఫామ్ లో అదరగొడుతున్న ఆటగాళ్లను కాదని ఫామ్ లో లేని ఆటగాళ్లకు ఎలా ఛాన్సులు ఇచ్చారు అంటూ ఎంతో మంది మాజీలు సెలెక్టర్ల తీరును ప్రశ్నిస్తూ ఉన్నారు.

 మరి ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్లో కూడా ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలీ. దీంతో హార్దిక్ పాండ్యాను వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేసే ప్రసక్తే లేదు భారత మాజీలు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అలాంటి హార్దిక్ పాండ్యాకు టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఐపీఎల్లో ఫామ్ నిరూపించుకుంటున్న ఆటగాళ్లను మాత్రం సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఇదే విషయంపై అటు మాజీ ప్లేయర్లు సెలెక్టర్లు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఇక ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలెక్టర్ల తీరును తప్పుపట్టాడు. ఫామ్ లో లేని హార్దిమ్ కు t20 వరల్డ్ కప్ లో చోటు ఇవ్వడమే కాదు.. వైస్ కెప్టెన్సీ ఎలా ఇస్తారు అంటూ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. దేశ వాలి క్రికెట్లో నిరూపించుకోవాలంటు అయ్యర్, ఇషాన్ లను పక్కన పెట్టారు. మరి ఆ నిబంధన హార్దిక్ కు వర్తించదా.. భారత క్రికెట్లో అతని నిలకడ, నిబద్ధతపై సందేహాలు ఉన్నాయి. సెలెక్టర్ల ప్రణాలిక ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. వైస్ కెప్టెన్గా బుమ్రా సరైన ఆటగాడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: