ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని నేతృత్వంలోని టీమ్ మెంబర్స్ అందరూ బౌలింగ్ చేశారు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయిన ఢిల్లీ, తమ బౌలింగ్ విభాగం ద్వారా మణిపూర్ జట్టును 120/8 పరుగులకు కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులోని టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక్కో ఓవర్ వేయడం జరిగింది. ఇంతకు ముందు ఏ జట్టు కూడా ఒక ఇన్నింగ్స్‌లో తమ 11 ఆటగాళ్లతో బౌలింగ్ వేయించలేదు. ఢిల్లీ జట్టులో హర్ష్ త్యాగీ, దిగ్వేష్ రాఠీలు తలా రెండు వికెట్లు తీసుకోగా, ఆయుష్ బదోని, ఆయుష్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఒక్కొక్క వికెట్ తీశారు. మాయంక్ రావత్, హిమ్మత్ సింగ్, అనుజ్ రావత్ వికెట్లు తీయలేకపోయినప్పటికీ బౌలింగ్‌లో తమ వంతు కృషి చేశారు. కొన్ని ఓవర్లు ఖర్చు అయినప్పటికీ, ఢిల్లీ జట్టు మణిపూర్ జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో విజయవంతమైంది.
44/4 పరుగులతో ఢిల్లీ జట్టు ఓడిపోయే లాగానే కనిపించింది. కానీ తన లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ విజయంలో ఓపెనర్ యశ్ ధుల్ 59 రన్స్ (నాటౌట్) చేసి జట్టును గెలిపించాడు. గ్రూప్ C లో ఉన్న ఢిల్లీ, ఈ టోర్నీలో తన తొలి నాలుగు మ్యాచ్‌లను కూడా గెలుచుకుని ఓడిపోని టీం గా కొనసాగుతోంది. 12 పాయింట్లతో ఈ జట్టు గ్రూప్‌ను ఆధిపత్యం చెలాయించేస్తోంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ జట్లు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.
IPL చరిత్రలో కూడా రికార్డు
ఐపీఎల్ చరిత్రలో కోచి తుస్కర్స్ కేరళ, దక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు ఒక ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాయి. ఇంతకు ముందు ఏ ఐపీఎల్ జట్టు కూడా 11 మంది ప్లేయర్లతో బౌలింగ్ వేసే ప్రయోగం చేయలేదు.