బిగ్‌బాస్ కూడా మిగతా వారి నుంచి కాయిన్లు రాబట్టుకునేందుకు ఒకే చెప్పడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. ఇక సామ, దాన, భేద, దండోపాయాలతో తమ వద్ద ఉన్న కాయిన్ల విలువలను పెంచుకునేందుకు నడుం బిగించారు. మాస్టర్ పాయింట్లు మాస్టర్‌కు ఇచ్చేద్ధాం అని సోహైల్ చెప్పగా ఇందుకు అఖిల్ వద్దు అని తెగేసి చెబుతాడు. కానీ మాస్టర్ మాత్రం తన వద్ద లాక్కున్న కాయిన్లకు తనకు ఇచ్చేమని కోరారు.