ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా ఇప్పుడు 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోబోతుందని తెలిపారు. అయితే ఈ షో ఇప్పటికే 298 ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తైపోయాయి. అక్టోబర్ 9న 299వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఆ తర్వాత వారం అంటే అక్టోబర్ 16న 300వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన చిన్న ప్రోమోను కూడా అప్పుడే విడుదల చేసింది ఈటీవీ.