బిగ్ బాస్ హౌస్‌లోకి మోనాల్ సిస్టర్ అడుగుపెట్టి సర్ ప్రైజ్ చేసింది. తన సిస్టర్ని చూడగానే పరుగుపరుగున వెళ్లి తెగ ఏడ్చేసింది మోనాల్. ‘చాలా బాగున్నావు.. అమ్మ ఎలా ఉంది.. అమ్మ చాలా మిస్ అవుతుంది.. ఇక్కడకు వచ్చే ముందు కునాల్‌తో మాట్లాడావా .. నా గురించి అఖిల్ గురించి బయట చెడుగా అనుకోవట్లేదు కదా’ అని తన సిస్టర్ని అడిగింది మోనాల్.అభిజిత్ గురించి మోనాల్ అక్క హేమాలి సెటైర్లు వేయడంతో కాసేపు హౌస్ లో నవ్వులు పూయించారు. మోనాల్ అక్క అఖిల్ పై తనకున్న ఫీలింగ్ చెప్పింది. దీంతో అఖిల్ సిగ్గుతో మురిసిపోయాడు..