సీజన్ 5 కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్పుడే ఏర్పాట్లను షురూ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో లేక ఆ తరువాత జూన్ మొదటి వారంలో షోను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. సీజన్ 5లో గత సీజన్ కంటే గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్స్ గట్టిగానే వేస్తున్నట్లు టాక్.హోస్ట్ నాగార్జున ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది.బిగ్ బాస్ 5 రూమర్స్ స్టార్ట్ కాబోతోంది అంటూ రూమర్స్ రావడమే కాకుండా కంటెస్టెంట్ లిస్ట్ పై కూడా ఊహాగానాలు రావడం మరో షాకింగ్ న్యూస్. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' తో పాటు అంతకుముందు యూ ట్యూబ్ కంటెంట్ తో ఎంతగానో క్రేజ్ అందుకున్న షణ్ముక్ సీజన్ 5 మొదటి కంటెస్టెంట్ లు అంటూ వార్తలు గుప్పుమన్నాయి.. మరి ఈ సీజన్ కోసం బిగ్ బాస్ ఎలాంటి వాళ్ళను దించుతాడో చూడాలి..