కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఎందుకంటే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అంతగా అందుకుంది.కార్తీక దీపం సీరియల్ సృష్టించిన రికార్డుల.. సృష్టిస్తోన్న సంచలనాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రెండూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఆ ప్రోమో లో కార్తీక దీపం సీరియల్ యూనిట్ హైలెట్ గా నిలిచింది.