తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రేమి.. కార్తీక దీపం షూటింగ్ విశేషాలను, ఫొటోలను షేర్ చేసుకుంటుంటారు. ఇక తాజాగా కూడా ప్రేమి విశ్వనాథ్ ఓ ఫొటోను షేర్ చేశారు.అందులో దీపతో పాటు కార్తీక దీపం సీరియల్లో నటించే హిమ, మురళీకృష్ణ ఉన్నారు. ఆ ఫొటో అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ప్రేమి షేర్ చేసిన ఈ ఫొటోకు ఆమె అభిమాని ఒకరు పెట్టిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.