హిమ చాలా సంతోషంగా.. ‘అమ్మా నిజంగానే..? మనం డాడీ దగ్గరకు వెళ్లిపోతామా?’ అంటుంది సంబరంగా. పక్కనే దీప తండ్రి మురళీకృష్ణ కూడా సంతోషంగా వింటూ ఉంటాడు. ‘మనం వెళ్లడం ఏంటమ్మా.. మీ నాన్నే పడవలాంటి కారేసుకొచ్చి.. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మనల్ని చేర్చి మన బతుకులు గట్టెక్కిస్తారు..’ అంటుంటే.. అటు హిమ, ఇటు మురళీ కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే దీప హిమని గుండెలకు హత్తుకుంటూ.. ‘హా.. మా ఆయన బంగారం. అంటూ హిమను ముద్దు పెట్టుకుంటోంది. ఈ సీన్ చూసిన ఎవరికైనా సీరియల్ ఇంక అయిపోతుందని అంటారు..