నాలుగు సీజన్లలో పాల్గొని రచ్చ చేసిన ఇంటి సభ్యులు ఒకే చోట చేరితే ఇంక రచ్చ రంబోలానే..ఇపుడు మాటీవీ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.మళ్లీ నాల్గో సీజన్ మొత్తం ఒకే సారి చూసినట్టు అందరికీ అనిపించింది.బిగ్ బాస్ ఉత్సవం పేరిట రాబోతోన్న ప్రోగ్రాంలో కంటెస్టెంట్లందరూ కూడా దుమ్ములేపుతున్నారు. ఇదివరకే నాలుగో సీజన్ కంటెస్టెంట్లు చేసిన సందడి అంతా చూశాం. అయితే మిగిలిన మూడు సీజన్ల కంటెస్టెంట్లు చేయనున్న సందడి రానున్న ఆదివారం ప్రసారం కాబోతోంది.