తెలుగు లో బిగ్ బాస్ మరో సీజన్ కి రెడీ కాబోతుంది.. ఇప్పటివరకు నాలుగు సీజన్ లతో ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఇక ఐదో సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం కాబోతుంది.. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ కు దక్కుతున్న ప్రేక్షకాదరణ అంతా ఇంతాకాదు.. దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో గా బిగ్ బాస్ అవతరించింది. దాదాపు పదిహేనుమంది కంటస్టెంట్ లు, ప్రతిరూమ్లో కెమెరా, వంద రోజులు ఒక ఇంట్లో ఉండాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.. అందుకే ప్రేక్షకులు ఈ షో కి కనెక్ట్ అయ్యారు.