ఈటివిలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శనివారం వస్తున్న గెస్ట్ లతో నాన్ సింక్ పంచులతో హైలెట్ గా నిలుస్తుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వచ్చే క్యాష్ ప్రోమో హల్చల్ చేస్తోంది. వచ్చే వారం శశి మూవీ యూనిట్ గెస్టులుగా వచ్చింది. హీరో ఆది, హీరోయిన్లు సురభి, రాశీ సింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు క్యాష్ ఆట ఆడేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారినే సుమ రివర్స్‌లో ఓ ఆట ఆడుకుంటుంది. సుమ టూరిజం అనే కాన్సెప్ట్‌తో శశి టీంను ఆడుకుంది. మా టూరిజంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని, ప్రేమికులకు ఇష్టమైన ప్లేస్‌కు తీసుకెళ్తామని ఆది, సురభిలకు చెప్పింది సుమ. తీరా చూస్తే స్మశాన వాటికను చూపించింది. అక్కడ ఎవరూ ఉండరు.. పార్కుల్లో అయితే పోలీసులు మాటి మాటికి వచ్చి లేపుతారు.. కానీ అక్కడ మనమే లేచి పోవాలి..