బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ తన రియల్ క్యారెక్టర్ తో జనాలకు బాగానే కనెక్ట్ అయ్యాడు. అతని వినూత్నమైన స్టైల్ జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఫైనల్ వరకు కష్టపడి వచ్చిన సోహెల్ టైటిల్ పోటీలో గెలకపోయినా కూడా దాదాపు అభిజిత్ రేంజ్ లోనే క్రేజ్ అందుకున్నాడు.సోహెల్ ప్రస్తుతం జార్జిరెడ్డి నిర్మాతలతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇక శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయట. అయితే ఇందులో మెగాస్టార్ ను గెస్ట్ రోల్ చేయించడానికి అవకాశం అయితే ఉందట కానీ ఇంకా ఆ పాత్రపై ఎలాంటి నిర్ణయానికి రాలేదని సమాచారం.. క్లైమాక్స్ సీన్ లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది.. చూడాలి.