తెలుగు లో ప్రసారమయ్యే "పక్కింటి అమ్మాయి" అనే సీరియల్ ద్వారా హీరోయిన్ గా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ఆస్రాని. "పక్కింటి అమ్మాయి" సీరియల్ ద్వారా ఎంతోమంది మనసులను దోచిన ఈమె , అనతి కాలంలోని వెండితెరపై హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ క్రమంలోనే వెండితెర పైకి "మళ్లీ రావా " అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత "ప్రెజర్ కుక్కర్ , ఏ-యాడ్ ఇన్ఫినిటీయం వంటి తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి, అందరిని ఆకట్టుకున్నారు. ఈ హీరోయిన్ ఒక ఫోటో షూట్ ని నిర్వహించి , ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఆమె అందానికి, ఆమె ఇచ్చిన ఫోజులకు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి..