కన్నడ భామ లక్ష్మీ బారమ్మ ( 2013) సీరియల్ లో వీరిద్దరు చిన్ను, చందు గా ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటి వీరి పరిచయం ప్రేమగా మారింది. దీనితో గత ఎనిమిదేళ్లుగా చందన్ కుమార్,కవిత గౌడ లు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పెళ్లి అనంతరం చందన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఎవరిని పిలవలేకపోయాము. కరోనా తీవ్రతను తగ్గి, ఆంక్షలన్నీ ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని " అనుకున్నట్లు తెలిపాడు.