తాజాగా కార్తీకదీపం సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటూ, ఆమె జీవితంలో జరిగే ప్రతి క్షణాన్ని అభిమానులతో పంచుకునే అలవాటు మంచు లక్ష్మీ కి ఉంది. ఇక అందులో భాగంగానే కార్తీకదీపం సీరియల్ గురించి కూడా ఆమె ఒక ట్వీట్ చేసింది.. "కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చిన విషయం అందరికీ తెలుసు.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది "అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. "మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మీగారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ ట్వీట్‌ని డాక్టరు బాబు షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు.