తెలుగులో వస్తున్న కార్తీకదీపం రీమేక్ మలయాళం కారుముత్తు సీరియల్ నుంచి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇది ఏడు సంవత్సరాలపాటు ప్రసారమై ముగిసిపోయింది. ఇక ఆ సీరియల్లో కూడా దీప క్యారెక్టర్ ను ప్రేమీ విశ్వనాథ్ పోషించడం గమనార్హం. కానీ మలయాళం సినిమా సీరియల్ లో దీప, డాక్టర్ బాబు లకు కవల పిల్లలు ఉండరు. ఒక కూతురు ఉంటుంది. మలయాళం మాతృక లో వంటలక్కకు ఆక్సిడెంట్ అయి అదృశ్యమైపోయి, గతం మరిచిపోతే, ఆమెను మరొక కుటుంబం చేరదీస్తుంది. ఇక డాక్టర్ బాబు అనారోగ్యం పాలై అమెరికా వెళ్లిపోగా, వారి కుమార్తె పెరిగి పెద్దయ్యాక కలెక్టర్ అవుతుంది. అలా సెకండ్ సీజన్ మలయాళంలో మొదలై, ఇక కుటుంబం అంతా ఒక దగ్గరకు చేరడంతో ఆ సీరియల్ ముగిసింది.