దీపకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కార్తీక్, సౌందర్య దగ్గర కూర్చొని తెగ బాధపడిపోతుంటారు. వారి దగ్గరకు దీప తండ్రి మురళీకృష్ణ రెండు బ్రెడ్స్ తీసుకొని వచ్చి, కార్తీక్ కి ఇస్తూ వుండగా ,అందులో ఒకటి మీరు తినండి మావయ్య అంటూ అక్కడ నుంచి బయల్దేరాడు కార్తీక్. ఇక ఆ మాటను విని సౌందర్య షాక్ అవుతూ మురళీకృష్ణ ను చూడగా అవునమ్మా ! నన్ను మావయ్య అంటూ పిలిచాడు అంటూ సంబరపడిపోతాడు.కార్తీక్ దీప పై చూపిస్తున్న ప్రేమను చూసి, మోనిత తట్టుకోలేకపోతుంది. కార్తీక్ ప్రేమ కోసం ఎంత చేసినా కూడా ఏం లాభం లేదనుకుంటూ తన బతుకుకి మోక్షం లేదని చనిపోవాలని అనుకుంటుంది.