వంటలక్క, ఆ సీరియల్ నిర్మాత గుప్తా వెంకటేశ్వరరావు సరదాగా ముచ్చట్లు పెట్టారు.వీరు సంభాషణ మొదట కరోనా, లాక్డౌన్ దగ్గర మొదలై, మెల్లగా పొలిటికల్ వైపు వెళ్లింది. కేరళ లో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది అని చెప్పింది ప్రేమి విశ్వనాథ్. కేరళ మొత్తం ఫుల్ రెడీ అని అనడంతో.. మరి నీకు నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని అడిగారు నిర్మాత.'ఎమ్మెల్యే నా.. నాకు పొలిటికల్స్ ఇంట్రెస్ట్ లేదు సార్'అని చెప్పింది ప్రేమి. పోనీ కేరళ సంగతులు వదిలేయ్..కనీసం ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తావా? అని నిర్మాత అడగడంతో ..'హ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా'.. అని చెప్పింది వంటలక్క. మరి ఏ పార్టీలో చేరుతావని అడిగితే, అది చేరినప్పుడు చెప్తానంటూ తెలివిగా సమాధానం చెప్పింది వంటలక్క. ఆమె మాటలకు నిర్మాత తెగ నవ్వుకున్నారు..