తాజాగా జీ తెలుగు లో ప్రసారమయ్యే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఎప్పటిలాగే రవి తో కలిసి సుమ ఈ షో లో యాంకరింగ్ చేస్తుండగా, ఈ సారి ప్రోమో లో మాత్రం కేవలం రవి మాత్రమే కనిపించారు. అయితే ఈ వారం ప్రోమో లో సుమ కనిపించలేదు. ఇక ఈ ప్రోమో చూసినవారు ఈ వారం మాత్రమే సుమ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో కనిపించరా? లేక పర్మనెంట్ గానే సుమ ఈ షో కి దూరం అవుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం, సుమ నుంచి సమాధానం రావాల్సిందే.