త్రినయని సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్న జాస్మిన్ అసలు పేరు ప్రియాంక శర్మ. ఈమె మొదట వెండితెరపై అడుగు పెట్టి మన ఊరిలో మన ప్రేమాయణం, శివకాశిపురి వంటి చిత్రాల ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. అయితే మొదట సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదట.కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె తల్లి ఎంకరేజ్ చేశారు.అభిషేకం సీరియల్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టి, అక్కడ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అంతేకాదు రోజా అలాగే రెండు రెళ్ళ ఆరు వంటి సీరియల్స్ లో కూడా ఈమె నటిస్తోంది.