శాంతి స్వరూప్ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శాంతి స్వరూప్ పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసి అందరూ జబర్దస్త్ లోకి రాకముందు శాంతి స్వరూప్ కు చాలా కోట్ల ఆస్తి ఉండేది అని ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం అది నిజమే అని నమ్ముతూ, తన నటన మీద ఎంతో ఆసక్తి ఉండడంతో జబర్దస్త్ షోలో చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. అసలు తనకి ఎలాంటి ఆస్తి పాస్తి లేవంటూ, తన దగ్గర ఎలాంటి ఆడి కారు లేదని, తనది చాలా పేద కుటుంబం అని చెప్పుకొచ్చాడు శాంతిస్వరూప్. అంతేకాకుండా ఒక్కొక్కసారి తమకు తినడానికి తిండి ఉండదని, అలాగే రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయని, తనపై వస్తున్న వదంతులు నమ్మవద్దని వేడుకున్నాడు.