ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో ప్రసారమౌతున్న "రెచ్చిపోదాం బ్రదర్" కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది మేఘన కుమార్. మొదట తమిళ ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టింది. అక్కడ కూడా పలు సీరియల్స్ లో నటించింది.అక్కడ నటించినా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో తిరిగి తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్ళింది. దాంతో తెలుగులో "ఈ కథలో పాత్రలు కల్పితం"అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.