బుల్లితెర క్వీన్‌గా తన హవాను కొనసాగిస్తున్న యాంకర్ సుమ ఒక కార్యక్రమానికి రూ.70వేల నుంచి రూ. 80 వేల వరకు తీసుకుంటుందట. ఆడియో ఫంక్షన్, టీవీ షోలకు కలిపి నెలకు దాదాపు రూ. 30 లక్షల వరకు తీసుకుంటుందట. ఇంత సంపాదించే యాంకర్ మరొకరు ఎవరు లేరు అని కూడా చెప్పవచ్చు.సుమా దగ్గర ఒక స్కోడా న్యూ రాబిట్ కార్ , టయోటా కారు కూడా ఉంది.ఈ రెండింటి ధర సుమారుగా రూ.30 లక్షల వరకు ఉంటుంది.సుమకు మణికొండలో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఇక దాదాపుగా ఆ ఇంటి ధర రూ. 20 నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.