నిరుపమ్ తండ్రి పేరు"ఓంకార్ పరిటాల". నిరుపమ్ సినిమాలలో నటించడానికి వెళ్తాను అన్నప్పుడు తన తండ్రి వద్దు అని చెప్పారట.నిరుపమ్ చెన్నైలో MBA పూర్తి చేసుకొని.. హీరో అవ్వాలని ఆశతో తన తండ్రి ఒప్పించాలని హైదరాబాద్ వెళ్లగా.. అదే సమయంలో తన తండ్రి మరణించడంతో తన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆ సమయంలో ఉద్యోగం చేయాలా, తనకిష్టమైన జీవితాన్ని కంటిన్యూ చేయాలా.. అనే ఆలోచనలో పడిపోయాడు నిరుపమ్. అలా ఆ సమయంలో తన తండ్రి యొక్క సోదరుడు సహకారంతో చంద్రముఖి సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందట.