మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెర జీవితాన్ని మొదలుపెట్టి, నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి, ఆ తరువాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో "మామిళ్ల శైలజా ప్రియా"కూడా ఒకరు.శైలజ దాదాపుగా 80 చిత్రాలలో నటించింది. ఈ నటి తెలుగు,తమిళ భాషలలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె వయస్సు 43 సంవత్సరాలు.మొట్టమొదటిగా"ప్రియసఖి"అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ లో నటించిన తీరుకు ఈమెకు నంది అవార్డు కూడా లభించింది.శైలజ 2002 లో MVS కిషోర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ కలిసి ఒక కుమారుడు కూడా జన్మించారు.