పల్లవి గౌడ్.. "సావిత్రి" నాటిక చేసేటప్పుడు, వేరే నాటికలు నటించబోనని అగ్రిమెంట్ చేసుకున్నానని తెలిపింది. అలా సీరియల్ లో నటిస్తున్నప్పుడు, తనకు పేమెంట్ సరిగ్గా ఇచ్చేవారు కాదని తెలిపింది. దాదాపుగా రెండు నెలలు సైతం లేటుగా ఇచ్చేవారని తెలిపింది. దాంతో నాకు వేరే నాటిక లో ఆఫర్ వచ్చిందని నిర్మాతలకు చెబితే, నిర్మాతలు ఈ విషయంపై ఒప్పుకోలేదని తెలిపింది. ఒక పెండింగ్లో ఉన్న డబ్బులు అయినా ఇవ్వమని నిర్మాతలను అడిగితే ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. అలా డబ్బులు ఇవ్వకపోవడంతో నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దాంతో నేను వేరే సీరియల్స్ లో నటిస్తానని చెప్పడంతో.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తనపై బ్యాన్ చేశారని తెలిపింది.