బిగ్ బాస్ సీజన్-5 ఆదివారం ప్రారంభం కాగా సోమవారం నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభమైంది అన్న దానితో సంబంధం లేకుండా ప్రతి సోమవారం నామినేషన్స్ జరగటం బిగ్ బాస్ రూల్. గత సీజన్ లోనూ హౌస్ లోకి వచ్చిన మరుసటి రోజే నామినేషన్స్ మొదలయ్యాయి. దాంతో ఇంటి సభ్యులు అసలు ఒక్క రోజులో ఎలా నామినేట్ చేస్తాం అని మొండి చేసినా నామినేట్ చేయక తప్పలేదు. ఇక ఈ సీజన్ లో ఇంటి సభ్యులెవరూ నామినేషన్ ప్రక్రియలో వెనకడుగు వేయలేదు. రూల్స్ ముందే తెలుసుకున్నారో ఏమో కానీ నోరు మెదపకుండా ఫటా ఫట్ నామినేట్ చేయడం మొదలు పెట్టారు. ఇక నామినేషన్ ప్రక్రియలో కంటతడి పెట్టడాలు...వార్నింగ్ లు ఇచ్చుకోడాలు కూడా కనిపించాయి.